మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధికి సహకారం
పటాన్చెరు ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్చెరు, ఏప్రిల్ 30 : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల పరిధిలో గురువారం నిర్వహించిన నూతన కోఆప్షన్ సభ్యుల ఎంపిక అనంతరం మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి నూతన కో ఆప్షన్స్ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
తమపై నమ్మకంతో కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికకు సంపూర్ణ సహకారం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఐదు మున్సిపాలిటీలలో బిఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ ప్రమీల, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్లు హరీష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు అంతి రెడ్డి, రామచంద్రా రెడ్డి, వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






