calender_icon.png 18 February, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ మిల్లెట్ రైతులకు మద్దతు

18-02-2026 12:36:29 AM

‘ఎండ్-టు-ఎండ్ సపోర్ట్’ కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ఆధ్వర్యంలో తెలంగాణ మిల్లెట్ ఫార్మర్స్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ పేరుతో ప్రత్యేక రా ష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మంగళవారం మాదాపూర్‌లోని మినర్వా బాంక్వెట్ హాల్‌లో ప్రారంభించారు. మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ శరకడం నాయకత్వంలో ప్రారంభించారు.

తెలంగాణలో మిల్లెట్ రైతులకు దీర్ఘకాలిక, వ్యవ స్థీకృత, ఫలప్రదమైన మద్దతు అవసరమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 2026 నుండి ఫిబ్రవరి 2027 వరకు ఒక సంవత్సరం పాటు అమలులో ఉండే ఈ ప్రణాళిక, సాగు ప్రోత్సాహంతో పాటు స్థిరమైన అభివృద్ధి, ప్రజా గుర్తింపు, ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

ఉత్పత్తిదారులు మరియు కొనుగోలుదారుల మధ్య నేరుగా అనుసంధానం కల్పించడం, మిల్లెట్ ఎంట్రప్రెన్యూర్స్, మిల్లెట్ కిచెన్స్ ద్వారా డిమాండ్ పెంపు, అలాగే తెలంగాణ మిల్లెట్ ఉత్పత్తులను విస్తృత మరియు పోటీ మార్కెట్లకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులుగా కె. మాధవ రావు (రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్  వ్యవసాయం, గెస్ట్ ఫ్యాకల్టీ), నాగ శ్రీనివాస్ పోతిరెడ్డి (ఎండీఎఫ్ మిల్లెట్స్, ద బెస్ట్ ఫుడ్ కోఆర్డినేటర్), డా. గిరిధర్ (సెక్రటరీ, నేషనల్ మిల్లెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్), డా. మోనికా (మిల్లెట్ న్యూట్రిషనిస్ట్) పాల్గొన్నారు.