30 June, 2026 | 9:21 PM

Breaking News

సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు

30-06-2026 08:49 PM

కల్మలచెరువు స్త్రీనిధి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

మాజీ వివోఏ అమరారపు సైదులు ఆరోపణ

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామ సంఘబంధం–1 పరిధిలో స్త్రీనిధి లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపించినప్పటికీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిగినప్పటికీ,బాధ్యుల పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాజీ గ్రామ సంగం సహాయకుడు (వివోఏ),అంతర్జాతీయ పారా వాలీబాల్ క్రీడాకారుడు అమరారపు సైదులు ఆరోపించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ... 2016లో గ్రామ సంఘ సహాయకు డిగా బాధ్యతలు స్వీకరించి సభ్యత్వ రుసుములు, వాటాధనాలు, పొదుపులు సేకరించడం ద్వారా గ్రామ సంఘ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినట్లు తెలిపారు.2024 ఆగస్టు 29న రాజీనామా చేసే వరకు గ్రామ సంఘ ఖాతాల్లో ఎలాంటి సమస్యలు లేవన్నారు.అయితే అంతర్జాతీయ పారా వాలీబాల్ పోటీల కోసం నాలుగు నెలలు సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం స్త్రీనిధి ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు సైదులు పేర్కొన్నారు. 

సైదులు వివరణ:

స్త్రీనిధి రీపేమెంట్లలో రాంగ్ అడ్జస్ట్మెంట్లు జరిగాయని,2022 నుంచి 2024 వరకు అధికారులు నిర్వహించిన తనిఖీలు సంఘ సభ్యులు,నాయకులతో మాట్లాడకుండా కార్యాలయ స్థాయిలోనే ముగించారని మాజీ వివోఏ అమరారపు సైదులు ఆరోపించారు.సంఘ సభ్యులు చెల్లించిన సుమారు రూ.2.85 లక్షల నిధులను సంబంధిత సంఘాలకు సమాచారం ఇవ్వకుండా తిరిగి పంపించారని, రూ.1.66 లక్షల లావాదేవీలపై ఇప్పటికీ స్పష్టత లేదని పేర్కొన్నారు.తాను సెలవులో ఉన్న సమయంలో జరిగిన పరిణామాలకు తనను బాధ్యుడిగా చేస్తూ ఒత్తిడి తెచ్చి పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. గ్రామ సంఘాల ప్రయోజనాల దృష్ట్యా వివోఏ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు.కల్మలచెరువు గ్రామ సంఘబంధం–1 పరిధిలో స్త్రీనిధి లావాదేవీలపై స్వతంత్ర విచారణ నిర్వహించి,అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.