30 June, 2026 | 9:21 PM

Breaking News

సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ

30-06-2026 08:46 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): డివిజన్  ఉపాధ్యక్షులు గడప రాజయ్య తుమ్మ శ్రీనివాస్  ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శిబిరాలను సందర్శించి, సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు కృష్ణ, రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. బిఆర్ఎస్ హయాంలో అధికారులకు ఇచ్చిన ప్రయోజనాలు, కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, అధ్యాపకులు, మహిళలు, విద్యార్థులు, అసంఘటిత కార్మికుల తో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసగించింది.

కాంగ్రెస్ దుష్ట పాలన, అవినీతి చర్యలను మానుకోవాలని అధికారులు అడుగుతున్న న్యాయమైన కోరికలు తీర్చాలని పిఆర్పి ని వెంటనే ఇవ్వాలని, పే అప్గరేడేషన్ చేయాలనీ, సింగరేణి జెన్కో నుండి  రావాల్సిన షుమారు 56 వేల కోట్లు ఉంటేనే చెల్లించాలని సింగరేణి కాపాడాలని అన్నారు. సింగరేణిలో మొదటిసారి అధికారులు ర్యాలీలు చేయడం నిరాహార దీక్ష చేయడం ఇదే మొదటి సారి అని ఇప్పటివరకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని అన్నారు. అధికారులు కార్మికులు బాగుంటేనే సింగరేణి సంస్థ మనుగడ ఉంటుందని వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది.