30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పాలమూరులో నూతన అధ్యాయానికి శ్రీకారం

18-02-2026 12:36 AM
  1. మేయర్‌గా గుమ్మల్ మమత, డిప్యూటీ మేయర్‌గా మారేపల్లి సురేందర్ రెడ్డి
  2. దశాబ్దాల కాలంగా 1952 నుంచి నేటి వరకు ముదిరాజ్ చైర్మన్ కాలేదు
  3. నిబంధనలు వర్తిస్తాయని ముందే చెప్పిన ఎమ్మెల్యే 
  4. తమదైన శైలిలో సముచిత స్థానం కల్పించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) : పాలమూరు తొలి కార్పొరేషన్ ఎ న్నిక రసవత్తమైన చర్చ జరిగినప్పటికీ ప్రశాంతమైన వాతావరణంలోని ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలోనే ఎమ్మెల్యే యెన్నం శ్రీని వాస్ రెడ్డి పార్టీ అభ్యర్థుల కోసం సంపూర్ణ సహకారం చేసుకుంటూ గెలిపించుకునే బా ధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉందని తెలియజేస్తూనే నిబంధనలు వర్తిస్తాయని అందరూ పాటించాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎవరికి మేయర్ పదవి భరిస్తుందో అని ఒక్కసారిగా చర్చలకు పలు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఎవరి ఊహలకు అందం విధంగా ముదిరాజ్ సామాజిక వ ర్గానికి చెందిన గుమ్మల మమత కు మేయర్ పదవి బాధ్యతలను అప్పగించారు. డిప్యూటీ మేయర్ గా మారేపల్లి సురేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 

పాలమూరులో పదవులు ఇట్లా...

అందరికీ సముచిత స్థానం కల్పించేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎవ రికి అందని అంతుచిక్కని ఆలోచనలకు ప దులు పెడుతూ పలువురికి బాధ్యతలను అప్పగిస్తూ వస్తున్నారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కు అప్పగించగా, గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఆనంద్ గౌడ్ కు అవకాశం కల్పించారు. గ్రంథాలయ సంస్థ చైర్మ న్ మల్లు నరసింహారెడ్డి,

మైనార్టీ రాష్ట్ర ఫైనా న్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెద్దుల కొత్వాల్, నూతన మేయర్ ముదిరాజ్ కులానికి చెందిన గుమ్మల్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డిలకు బాధ్యతలను అప్పగిస్తూ అడుగులు వేశారు. మునుముం దు మరిన్ని అవకాశాలు వస్తే అందరికీ మరింత మేలు చేసేలా ఎమ్మెల్యే వేస్తున్న అడుగులకు మరింత పదును ఎక్కుతుంది.

-1952 నుంచి నేటి వరకు ముదిరాజ్ చైర్మన్ కాలే..

మహబూబ్ నగర్ మున్సిపల్ ఏర్పాటు 1952లో ఆవిష్కృతం అయినప్పటికీ దశాబ్దాల కాలం నుంచి ఒక్క ముదిరాజ్ కూడా మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం జరగలేదని మున్సిపల్ కార్యాలయంమే చెబుతుంది. అన్ని కోణాలను విస్తృతంగా ఆలోచన చేసి ముదిరాజ్ సామాజిక వర్గానికి సముచిత స్థానం అందించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న

నిర్ణయానికి యావత్తు ముదిరాజ్ లతో అన్ని సామాజిక వర్గాలు భ్రమరథం పడుతున్నాయి. అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం సమచి తమైనదేనని అందరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని పలువురు ప్రత్యేకంగా చర్చించుకుంటున్న మాట.

తప్పటడుగులు వేస్తే వెనకే ఉంటారు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పీ వెంకటేష్ 

కాంగ్రెస్ పార్టీ నిలువెత్తు నిదర్శనానికి పారదర్శకంగా అడుగులు వేస్తుందని పార్టీ లో ఉండి తప్పటడుగులు వేస్తే ఎప్పుడు వె నుకబడే ఉంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పీ వెంకటేష్ చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని, ఎవరు తప్పు పట్టేందుకు వీలు లేదన్నారు. 

ముదిరాజ్ కులానికి ఈ బాధ్యత నిర్వహించే హక్కు లేదా అని ప్రశ్నించారు. డబ్బులతో పదవులు వరిస్తాయి అనుకుంటే సరికాదని ఇతరులు ఓడిపోతే మేము మేమే మేయర్ అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదని కాంగ్రెస్ పార్టీ ఎందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుందన్నారు. పట్టణ ప్రజల పూర్తిస్థాయిలో అవగతమై ఉన్నారని ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోరని తెలిపారు.