calender_icon.png 18 February, 2026 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చొప్పదండిని అభివృద్ధి పదంలో నడిపిద్దాం

18-02-2026 12:36:24 AM

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): చొప్పదండిని అభివృద్ధి పథంలో నడిపించుకొని మరింత అభివృద్ధిని చేద్దామని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యకర్తల సమావేశంలో తెలిపారు. చొప్పదండి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులను తన బుధస్కందాలపై వేసుకొని 10 వార్డుల కౌన్సిలర్లను గెలిపించి చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండాను కైవసం చేసుకునీ మున్సిపల్ చైర్మన్ గా వడ్లూరి సరితా శ్రీనివాస్, వైస్ చైర్మన్ గ పెరుమండ్ల మానస గంగయ్య గార్లను ప్రమాణ స్వీకారం చేయించిన చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారు.

చొప్పదండిలో 10 మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లను గెలిపించిన శుభ సందర్భంలో  ఉద్యమ కవి గాయకులు మావురాల ఎల్లమ్మ సాంగ్ ఫేమ్ టీపీసీసీ సాంస్కృతిక సేన జిల్లా ఉపాధ్యక్షులు గసికంటి కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యమన్న గారి ఇచ్చిన హామీతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండు సంవత్సరాలలో పేదలకు అందిస్తున్న సంక్షేమంతో పాటు చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని తెలిపారు. చొప్పదండి మున్సిపాలిటీ లోని అన్ని వార్డుల అభివృద్ధి బాధ్యత గౌరవనీయులు చొప్పదండి శాసన సభ్యులు కరీంనగర్ జిల్లా ౄCC అధ్యక్షుడు మేడిపల్లి సత్యం  గారిదే నన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చాకుంట సర్పంచ్ పురం రాజేశం గారు, మాజీ PACS సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి జనార్ధన్ గారు, కొలిమి కుంట మాజీ సర్పంచ్ నెరుమట్ల మల్లేష్ గారు, మాజీ ఎంపిటిసి కుందేళ్ళ కవిత బాలకిషన్ గారు, రాగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు(మార్కెట్ కమిటీ డైరెక్టర్) ఈర్ల స్వామి, పెరుమండ్ల రవీందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుస భీమన్న, సింగసాని మల్లేష్, శ్రీకాంత్, కోలపురి ప్రభాకర్,మచ్చ రమేష్, కుమార్ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.