గెలుపు బాట పట్టే దెవరు?
చెన్నైతో సన్‌రైజర్స్ ఢీ
చెపాక్‌లో రసవత్తర పోరు
చెన్నై, మే 17 : ఐపీఎల్ 19వ సీజన్‌లో సోమవారం ఆసక్తికర పోరు జరగబోతోంది. ప్లే ఆఫ్ బెర్తులు మూడే మిగిలి ఉన్న నేపథ్యంలో 7 జట్లు పోటీలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూప ర్ కింగ్స్ కీలక మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. దీనిలో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌కు మ రింత చేరువవుతుంది. ఓడిన జట్టు రేసులో వెనుకబడుతుంది. చెపాక్ వేదికగా జరగబో యే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పైనే అందరి దృష్టీ ఉంది. ఎందుకంటే సన్‌రైజర్స్ తో పోలిస్తే సీఎస్కే పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న చెన్నై మిగిలిన రెండింటిలో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. రన్‌రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. గత మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓడిపోవడం కాస్త ఇబ్బందిగా మారింది. ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశముంది.
ధోనీ ఈ మ్యాచ్‌లో ఆడతాడని భావిస్తున్నారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానం లో కొనసాగుతోంది. చెన్నైని ఓడిస్తే ప్లే ఆఫ్స్ కు మరింత చేరువవుతుంది. బ్యాటింగ్‌లో హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ కీలకం. బౌలింగ్ లో కమిన్స్‌తో పాటు యువ పేసర్లు ప్రపుల్, హొస్సేన్ అదరగొడుతున్నారు. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న చెపాక్ పిచ్ గతానికి భిన్నంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. గత రికార్డుల విషయానికొస్తే చెన్నై సూపర్ కింగ్స్‌దే పై చేయిగా ఉంది.
తుది జట్ల అంచనా
చెన్నై : సంజూ శాంసన్, రుతురాజ్(కెప్టెన్), కార్తీక్ శర్మర/ధోనీ, బ్రెవిస్, ప్రశాంత్ వీర్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి, గుర్జప్‌నీత్ సింగ్
హైదరాబాద్ : అభిషేక్ , ఇషాన్ కిషన్, క్లాసెన్, సలీల్ అరోరా, నితీశ్ రెడ్డి, స్మ రన్ రవిచంద్రన్, కమిన్స్, శివాంగ్ కుమార్, మలింగ, షకీబ్ హొస్సేన్, ప్రఫుల్






