18 May, 2026 | 10:19 AM

ప్లే ఆఫ్స్‌కు బెంగళూరు

18-05-2026 12:44 AM

మళ్లీ ఓడిన పంజాబ్ కింగ్స్

వరుసగా ఆరో ఓటమి

ఛేజింగ్‌లో మరోసారి తడబాటు

ఐపీఎల్ 19వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిం ది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ పోరు అభిమానులను అలరించింది. పం జాబ్ కింగ్స్ మరోసారి ఛేజింగ్‌లో తడబడి పరాజయం పాలైంది. 

ధర్మశాల, మే 17 : మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. జాకబ్ బెథెల్ మరోసారి ఫె యిలయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ, పడిక్క ల్ ఆర్సీబీ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 76 పరుగులు జోడిం చారు.

సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ మరో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అటు పడిక్కల్ కూడా దూకుడుగా ఆడాడు. పడిక్కల్ 25 బంతుల్లో 45 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. కోహ్లీకి వెంకటేశ్ అయ్యర్ జత కలిసాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లీ 37 బంతుల్లో 58 (4 ఫోర్లు, 3 సిక్స ర్లు) రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ దూకుడు కొనసాగింది.

టిమ్ డేవిడ్‌తో కలిసి నాలుగో వికెట్ కు 30 బం తుల్లోనే 65 పరుగులు జోడించారు. వెంకటేశ్ అయ్యర్ కేవలం 40 బంతుల్లోనే 8 ఫోర్లు,4 సిక్సర్లతో 73 రన్స్‌తో నాటౌట్ గా నిలిస్తే టిమ్ డేవిడ్ 28 పరుగులు చేసి ఆఖరి బంతికి ఔటయ్యాడు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగుల భారీస్కోర్ చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్ల లో హర్ ప్రీత్ బ్రార్ 2, చాహల్ 1, అర్షదీప్ సింగ్ 1 వికెట్ పడగొట్టారు.డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో పంజాబ్ కింగ్స్ చెలరేగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే తీవ్ర ఒత్తిడిలో ఉన్న పంజాబ్ ఓపెనర్లు నిరాశ పరిచారు.

ఫస్టాఫ్‌లో వరుస విజయాల్లో కీలకపాత్ర పోషించిన ప్రియాన్ష్ ఆర్య(0), ప్రభ్ సిమ్రన్ సింగ్ (2) వెంటవెంటనే ఔటయ్యారు. శ్రేయాస్ అయ్యర్ (1) కూడా ఔట వడంతో పంజాబ్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కూపర్ కన్నోలీ, సూర్యాన్ష్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 43 పరుగులు జో డించారు. కన్నోలీ 22 బంతుల్లో 37 (3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యాన్ష్ 22 బంతుల్లో 35 పరుగులకు ఔటయ్యారు.

ఇక్కడ నుంచీ స్టోయినిస్, శశాంక్ సింగ్ పోరాడారు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 67 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పింది. వీరిద్దరూ క్రీజులో ఉండడంతో పంజాబ్ అద్భుతం చేసేలా కనిపిం చింది. కానీ హ్యాజిల్‌వుడ్ స్టోయినిస్ (37)ను పెవిలియన్‌కు పంపడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది. తర్వాత శశాంక్ సింగ్ (27 బంతుల్లో 56) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో పంజాబ్ కిం గ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులే చేయగలిగింది. పంజాబ్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి. అటు బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరితే పంజాబ్ కింగ్స్ తన అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

స్కోరు బోర్డు 

బెంగళూరు ఇన్నింగ్స్ : 222/4 ( వెంకటేశ్ అయ్యర్ 73 నాటౌట్, కోహ్లీ 58, పడిక్క ల్ 45 ; బ్రార్ 2/35 , అర్షదీప్ సింగ్ 1/43)

పంజాబ్ ఇన్నింగ్స్ : 199/8 ( శశాంక్ సింగ్ 56, స్టోయినిస్ 37 , కన్నోలీ 37 ; రసిక్ సలామ్ దార్ 3/36, భువనేశ్వర్ కుమార్ 2/38 )