ధోనీ వీడ్కోలు మ్యాచ్?
18-05-2026 12:39 AM
చెన్నై, మే 17: చెపాక్‌లో సన్‌రైజర్స్‌తో మ్యా చ్ మహేంద్రుడికి వీడ్కో లు మ్యాచ్ కానుందా.. అంటే అవుననే అంటున్నారు హర్షా భోగ్లే. ఈ మ్యాచ్‌లో చెన్నై ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఉండబోతుందని భోగ్లే చెబుతున్నారు. అది ధోనీ రీఎంట్రీ కావొచ్చని, రిటైర్మెంట్ ప్రకటన కూడా కావొచ్చేమో అని వ్యాఖ్యానించారు. చెపాక్‌లో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసే నిర్ణయం వచ్చినా తానేమీ అనుకోబోనని చెప్పుకొచ్చారు. ఈ సీజన్‌లోగా యం కారణంగా ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ధోనీ ఆడతాడని స్టేడియానికి వస్తు న్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగులుతోంది.






