21 March, 2026 | 4:45 AM

వేసవిలో కరుప్పు వినోదం

21-03-2026 12:00 AM

స్టార్ హీరో సూర్య ఇప్పుడు మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు ఆర్‌జే బాలాజీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రచార చిత్రాలు సినీప్రియులను ఆకట్టుకున్నాయి.

ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్‌లో కథానాయకుడు సూర్య శక్తిమంతమైన అవతార్‌లో కనిపించారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఇదే ఏడాది మే 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ సూర్య ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం సమకూర్చుతుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను జీకే విష్ణు నిర్వర్తిస్తున్నారు. ఇక యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా అన్బరివ్ విక్రమ్ మోర్, ఎడిటర్‌గా ఆర్ కళైవానన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అరుణ్ వెంజారామూడు పనిచేస్తున్న ఈ చిత్రానికి  నిర్మాతలు: ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు; రచన, దర్శకత్వం: ఆర్‌జే బాలాజీ.