రాకాస.. స్నేక్ డ్యాన్స్
జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించిన తాజాచిత్రం ‘రాకాస’. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ‘స్నేక్ డ్యాన్స్’ అనే పాటను విడుదల చేశారు. ఇదొక ప్రమోషనల్ సాంగ్. గ్యాంగ్ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఈ పాటను రూపొందించారు.
అనుదీప్ స్వరపర్చిన ఈ గీతానికి రఘురాం సాహిత్యం అందించగా.. బెన్నీ దయాల్, మనీషా పాండ్రంకి, రితేష్ జీ రావు, లక్ష్మీ మేఘన, వినాయక్ పాడారు. ఈ పాటలో నాయకానాయికలు సంగీత్ శోభన్, నయన్ సారికతోపాటు ప్రధాన తారాగణం వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తమదైన స్టైల్ డాన్సులతో ఆకట్టుకున్నారు. చివరలో ప్రొడ్యూసర్ నిహారిక స్టెప్పులు వేస్తూ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రానికి డీవోపీ: రాజు ఎదురురోలు; సంగీతం: అనుదీప్ దేవ్; ఎడిటర్: అన్వర్ అలీ; ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్లా.




