11 July, 2026 | 7:15 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

నవ దంపతుల ఆత్మహత్య

03-05-2026 12:00 AM

కూకట్‌పల్లి, మే ౨ (విజయక్రాంతి): నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కుమ్మరి బస్తిలో శనివారం చోటుచేసుకుంది. ఐటీసీ లో సేల్స్ ఎక్స్  క్యూటివ్‌గా పనిచేస్తూ కుమ్మరి బస్తీలో నివసించే యంజాల కార్తీక్(28) అదే బస్తీకి చెందిన ఎర్రమళ్ళ లక్ష్మణ్ కుమార్తె మంజుల (27)ను ఇష్టపడి మార్చి 8న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అనన్య ఆసుపత్రి నుండి పోలీస్ స్టేషన్‌కు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రాగా పోలీసులు ఆసుపత్రి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తులో భార్య మంజుల నోటి నుంచి నురగలు వచ్చినట్లు, భర్త కార్తీక్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.ఇద్దరి ఆత్మ హత్యలకు నవ దంపతుల మధ్య కుటుంబ కలహాలే కారణమా లేక మరి ఏదైనా కోణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.