భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీసర్వే లక్షమని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. భూభారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూరి సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందుకోసం 5700 మంది శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేల సేవలను వినియోగించుకోవాలని కోరారు. రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్సుడు సర్వేయర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
లైసెన్స్ సర్వేలకు ఉద్యోగం రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా లక్ష్యాలు లేని 413 ప్రాంతాల్లోనే ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ సర్వేతో 95% వరకు భూ సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా గ్రామాల రైతులకు కొత్త పట్టా దార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. రీ సర్వేకు అవసరమైన అత్యుత్తమ నాణ్యత గల పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని కొనుగోలు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
కలెక్టర్లు భూరి సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని అవసరమైన ఇబ్బంది పరికరాలు మౌలిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు. ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని తెలిపారు. మార్చి 2027 నాటికి మూడు విడుదల్లో రీ సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రీ సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయాలకు ఎకరాకు 50 రూపాయలతో పాటు రవాణా ఇతర ఖర్చులు కోసం మరో 10 రూపాయలు చెల్లించి మొత్తం 60 రూపాయలు అందజేస్తామన్నారు. చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. జూలై 28 లోపు వీధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్ లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు.
వారికి బీమా సామాజిక భద్రత కల్పించే చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. ఒక సర్వే నంబర్లో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సాదా బైన మదరకాసులను నిబంధనల ప్రకారం పరిష్కరించి నోటీసులు త్వరితగతిన జారీ చేయాలని సూచించారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బాల్లో వచ్చిన 6,500 రెవిన్యూ సమస్యల్లో 98 శాతం సమస్యలకు బూరు సర్వే తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
మొదటి విడత ఇందిరా మహిళ నిర్మాణాల్లో సరదాగా పూర్తి చేయాలని పెండింగ్లో ఉన్న 2 బిహెచ్కె ఇండ్లను లబ్ధిదారులకు అందజేసి మిగిలిన పనులను అనంతరం నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. నిధులు విడుదలైన పనులు చేపట్టనిచోట్ల బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లా లబ్ధిదారులు ఎంపిక వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మొదటి విడుదల మంజూరు కానీ అర్హుల ఇళ్లను కూడా రెండవ విడుదల చేర్చి మంజూరు చేయాలని సూచించారు.
ఇసుక కంకర సరఫరా లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి వీపీ గౌతమ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ లు మాట్లాడారు. విద్యార్థులకు ఆగస్టు 15లోగా ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫామ్ అందేలా కలెక్టర్ లు, డిఆర్డిఏ, గురుకులాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు, విక్టర్, ఎన్ వై గిరి, ల్యాండ్ సర్వే ఏడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






