ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన
బోథ్,(విజయక్రాంతి): బోత్ మండల కేంద్రంలో శనివారం ఎస్ ఐ ఆర్ హెల్ప్ డెస్కుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ఫారాలను హోటల నుండి స్వీకరించడం జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ అన్నపూర్ణ మహేంద్ర ఆధ్వర్యంలో డెస్క్ ను ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన పదిమంది బిఎల్వోలు సూపర్వైజర్లు గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ఓటర్ల అన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఫారాలను పూర్తి చేసి అందించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు సుమలత ఆర్ఐ నాగోరావు హిందూ పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్న ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మహేందర్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ లు షేక్ అవుట్ కౌసర్ ఎండి అబ్రా లతోపాటు కాంగ్రెస్ నాయకులు మెరుగు నరసింహ దాస్ షేక్ అచ్యుత్ రెడ్డి సన్నీ రెడ్డి అమీర్ తదితరులు పాల్గొన్నారు






