జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్
పెనుబల్లి ప్రతిభకు దేశవ్యాప్త గుర్తింపు
పెనుబల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కొప్పుల గోపాలరావు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ నేషనల్ డిజిటల్ సర్క్యూట్–2026 ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొని విశేష ప్రతిభ కనబర్చిన ఆయన రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఎఫ్‌ఐపీ మెన్ &ఉమెన్ విభాగాలకు సంబంధించిన పోటీలలో ఆయన సమర్పించిన ఛాయాచిత్రాలు న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకోవడంతో మొదటి బహుమతిని అందుకున్నారు.దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ప్రతిభావంతుల మధ్య గోపాలరావు చూపిన సృజనాత్మకత ప్రత్యేకంగా నిలిచింది.ఈ విజయంతో ఖమ్మం జిల్లా, ముఖ్యంగా పెనుబల్లి మండలానికి గర్వకారణంగా మారారు.ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, స్నేహితులు,ఫోటోగ్రాఫర్లు, కళాభిమానులు,శ్రేయోభిలాషులు ఘనంగా అభినందించారు.






