11 July, 2026 | 7:13 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్

11-07-2026 06:09 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మాజీ జడ్పిటిసి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం తండ్రి లింగయ్య శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి శనివారం వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచిస్తూ, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం వైస్ చైర్మన్ పాతిపల్లి ఎల్లయ్య, మాజీ ఎంపీపీ మల్హర్ రావు, కార్పొరేటర్ మారెల్లి సుశీల–రాజిరెడ్డి, కార్పొరేటర్ డీటీ బాలరాజు, తాడ్చర్ల ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకులు, బుచ్చంరావు, నూనెటి కృష్ణ యాదవ్, చారి,  సర్పంచులు, ఉపసర్పంచులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.