ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది రోడ్డు ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో,సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శనివారం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో స్వయంగా తెలుసుకున్నారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వ వైద్యులకు ఆమె సూచించారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధారావత్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ,సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు,కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు,పట్టణ అధ్యక్షులు ఉస్మాన్‌తో పాటు మండల,పట్టణ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.






