30 August, 2026 | 10:11 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

టీజీపీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా సూదిని రాంరెడ్డి ప్రమాణ స్వీకారం

14-05-2026 12:18 AM

రంగారెడ్డి, మే 13 (విజయక్రాంతి): నగరంలోని ఎర్రమంజిల్ పంజాగుట్టలో ఉన్న పంచాయతీ రాజ్ ఈ ఎన్ సీ భవన్ లో  ట్రిబ్యునల్ నూతన చైర్మన్గా  సూదిని రాంరెడ్డి  బాధ్యతలు స్వీకరించారు. వారితో పాటు ట్రిబ్యునల్ సభ్యులుగా కృష్ణకుమార్ గౌడ్ నాగులూరి, బాస వేణుగోపాల్ యాదవ్ గార్లు ప్రమాణ స్వీకారం చేశారు.

ట్రిబ్యునల్ సెక్రటరీ కె. నాగమణి గారు నూతన చైర్మన్ మరియు సభ్యులచే పదవీ ప్రమాణం చేయించి, అధికారికంగా బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమంలో  కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి  ప్రత్యేక అతిథిగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో జోగారెడ్డి కృపాకర్ రెడ్డి నాయకులు సూదిని పద్మారెడ్డి, సూదిని మనోహర్ రెడ్డి, సూదిని లక్ష్మా రెడ్డి, సూదిని అరవింద్ రెడ్డి, కాయితి సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాంరెడ్డికి సత్కారం..

నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ సూదిని రాంరెడ్డి గారిని మరియు సభ్యులను మాడుగుల గ్రామ నివాసులు, కుటుంబ సభ్యులు, ట్రిబ్యునల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పర్వేజ్ మరియు కార్యాలయ సిబ్బంది శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నూతన కార్యవర్గం పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు.