19 August, 2026 | 3:49 PM

పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా

19-08-2026 03:07 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను ఎస్బిటిఈటి పరిధిలోనే కొనసాగించాలని విద్యార్థులు ఆందోళన చేశారు. జీవో 97 ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. BRSV మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ మాట్లాడుతూ... విద్యార్థులు ఆందోళనకు మద్దతు పలికారు., విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే GO 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలనీ కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం సరికాదన్నారు.

విద్యార్థులు, అధ్యాపకులు, విద్యా నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనీ సూచించారు. SBTETను బలోపేతం చేయాల్సింది పోయి, దాని పరిధిని మార్చే ప్రయత్నాలు చేయడం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి GO 97ను ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేశారు. GO 97 రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను SBTET పరిధిలోనే కొనసాగించే వరకు BRSV  పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందినీ హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో BRSV మాజీ పట్టణ అధ్యక్షుడు మురుకురి శ్రావణ్,రియాజ్,అరుణ్,సుమంత్,రాంచరణ్,విద్యార్థులు పాల్గొన్నారు.