19 August, 2026 | 4:25 PM

శారదానగర్ రోడ్డు సమస్య పరిష్కారానికి చర్యలు

19-08-2026 03:29 PM

ఉప్పల్,(విజయక్రాంతి): రామంతాపూర్ డివిజన్ శారదానగర్ అడ్రమ్ గల్లీలో కొత్తగా వేసిన బీటీ రోడ్డుపై మ్యాన్‌హోల్స్ రోడ్డు స్థాయికి సమానంగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జోనల్ కమిషనర్ రాధికా గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. సమస్యపై స్పందించిన కమిషనర్, సంబంధిత అధికారులతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంథం నాగేశ్వరరావు పాల్గొన్నారు.