ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు
19-08-2026 03:09 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ ఓడ్ల మహేందర్ తమ్ముడు ఓడ్ల కృష్ణ ఆకస్మికంగా మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బాన్సువాడ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ షేక్ జుబేర్ మైలారం గ్రామానికి చేరుకుని కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.






