అగ్ని ప్రమాద బాధిత క్రీడాకారుడికి బియ్యం వితరణ
19-08-2026 03:40 PM
గణపురం,(విజయక్రాంతి): గణపురం మండల కేంద్రానికి చెందిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బానాల రవి ఇంటి లో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి బాధిత కుటుంబాన్ని పరామర్శించి బియ్యం అందజేశారు. ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో స్థానిక క్రీడాకారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






