ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
నిర్మల్,(విజయక్రాంతి): ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్, నిర్మల్ జిల్లా యూనియన్, కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ ఠాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఫోటోగ్రాఫర్ల జెండాను ఆవిష్కరించి జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఫోటో వృత్తిలో మృతి చెందిన ఫోటోగ్రాఫర్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల అభివృద్ధికి ఏవైనా సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలన్నారు. అదే విధంగా జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు స్థలాన్ని కేటాయించాలని కోరారు. అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.






