7 July, 2026 | 6:23 PM

Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •   చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్   •  

ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి

07-07-2026 05:10 PM

సూర్యాపేట జిల్లా డిఐఈవో సులోచనా రాణి

నేరేడుచర్ల,(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారము, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందని  ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను పేద, మధ్య తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలని సూర్యాపేట జిల్లా డీఐఈవో సులోచనా రాణి అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లాలో కూడా ప్రభుత్వం మధ్యాహ్న భోజనము, అల్పార పథకం అమలు చేయనున్నట్లు, అలాగే విద్యార్థులకు ఇప్పటికే ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని,విద్యార్థులకు ప్రభుత్వము ఏకరూప దుస్తులు, షూస్, నోట్ పుస్తకాలు అందించేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి మొదటి సంవత్సరం సైన్స్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టిందని, దీంతో సంవత్సరం ప్రారంభం నుంచి ప్రాక్టికల్స్ చేయిస్తారని,కొత్త అడ్మిషన్ల సంఖ్యను పెంచాలని అధ్యాపకులను కోరారు.