7 July, 2026 | 6:23 PM

Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •   చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్   •  

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్

07-07-2026 05:07 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం పెద్దకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ కాటం వెంకటేశం మంగళవారం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో మెనూ రేట్లను పెంచడంతో పాటు ఉపాధ్యాయులు కూడా పాఠశాలలోనే విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించిందన్నారు. ఈ విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం శ్రీధర్, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు హరీష్ రెడ్డి, ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.