విద్యార్థుల మానసిక జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయి
గరిడేపల్లి,(విజయక్రాంతి): చారిత్రక జీవవైవిద్య వృత్తి విద్యల సందర్శనల వల్ల విద్యార్థుల మానసిక జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయని ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రసన్న కుమారి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పీఎం శ్రీ గడ్డిపల్లి మోడల్ స్కూల్ వైజ్ఞానిక వృత్తి విద్య యాత్రలో భాగంగా గోల్కొండ కోట, నెహ్రూ జులాజికల్ పార్కు, స్వామి రాంపానంద తీర్థ ఇన్స్టిట్యూట్ భూదాన్ పోచంపల్లిని సందర్శించడం జరిగింది.
యాత్రలో భాగంగా విద్యార్థులకు 10,12 తరగతులలో ఉన్న గోల్కొండ పట్టణ, చారిత్రక అంశాలు, సాహిత్యం, సంస్కృతిక కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న వివిధ జాతి పక్షులు, జంతువులు, జీవవైవిద్యాన్ని ఎలా కొనసాగిస్తాయో క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వృత్తి విద్యలో భాగంగా స్వామి రామానంద తీర్థ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి విద్యార్థులు ఐటీ వలన విద్యార్థులకు ఎలాంటి జీవనోపాధి సౌకర్యాలు కలుగుతాయి. ఐటి వలన జీవన వికాసం ఎలా మెరుగవుతుందో వసంత కుమారి వివరించారు.




