4 March, 2026 | 9:00 PM

పెరిగిన కరువు భత్యం చెల్లించాలి

04-03-2026 05:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు పెరిగిన కరువు భత్యం వెంటనే చెల్లించాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాజన్న అన్నారు. బుధవారం బీడీ కార్మికుల సమావేశంలో పాల్గొన్నారు. బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు గాను ఐదు పాయింట్ రూ.5.50 కరువు బత్యం పెరిగిందని దాన్ని వెంటనే యాజమాన్యాలు చెల్లించాలన్నారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బక్కన్నగంగన్న గఫూర్ లక్ష్మీ తదితరులున్నారు.