22 August, 2026 | 4:36 PM

చెట్టు కిందే తరగతులు.. కళాశాలలో వసతిగృహం నిర్వహణ

22-08-2026 03:36 PM

తరగతి గదులు లేక విద్యార్థులకు ఇబ్బందులు

వర్షం పడితే కళాశాలకు డుమ్మా 

బాన్సువాడ, ఆగస్టు 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీసీ సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహం ఏర్పాటు చేయడంతో కళాశాల విద్యార్థులకు తరగతి గదుల కొరత ఏర్పడింది. దీంతో విద్యార్థులు కళాశాల ఆవరణలో చెట్ల కింద కూర్చొని తరగతులు వినాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండ, వర్షాల సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే చాలు కళాశాలకు డుమ్మా కొట్టాల్సిందేనని విద్యార్థులు వాపోతున్నారు. కళాశాల విద్యార్థులకు సరిపడా తరగతి గదులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. వసతి గృహాన్ని మరో భవనంలోకి మార్చాలని విద్యార్థులకు డిమాండ్ చేస్తున్నారు.