తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ జట్ల ఎంపిక
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 22 ( విజయక్రాంతి ): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అనుమతితో జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగులకు భారత ప్రభుత్వము ప్రతి సంవత్సరం అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2026, 27 సంవత్సరానికి గాను నిర్వహించనున్న టోర్నమెంట్ పోటీలలో పాల్గోనాలనుకునే అభ్యర్థులు ఈనెల 9 మరియు 10వ తేదీలలో హైదరాబాదులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ఎంపిక కావలిసి ఉంటుందని పేర్కొన్నారు. అందులో భాగముగా అథ్లెటిక్స్, క్రికెట్, చెస్ క్యారమ్, హాకి, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిసిక్, రెస్లింగ్, ఖో ఖో, యోగా, లాన్ టెన్నిస్, బాస్కెట్ బాల్, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫూట్ బాల్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారని తెలిపారు.






