నిర్మల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా
నిర్మల్,ఆగస్టు 22 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం(BJYM) ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్‌లో ధర్నా శనివారం నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి బీజేవైఎం నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేవైఎం నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా (BJYM) జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్లు సూరజ్ నాయక్, సాత్విక్, BJYM నాయకులు వెంకటేష్, భరత్, విజయ్, సృజన్, బంటి, చరణ్, దీక్షిత్, అనిల్, శ్రీకాంత్, మధు, ప్రణయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






