22 August, 2026 | 5:00 PM

శామీర్ పేటలో నూతన కాంగ్రెస్ కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక

22-08-2026 04:07 PM

 జనగామ, (విజయక్రాంతి): జనగామ మండలం శామీర్ పేట(Shamirpet) గ్రామంలో టీపీసీసీ ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచనతో నూతన గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా నియమించారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాదం రమేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గద్ద నరేష్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కంసాని భాస్కర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడిగా జిట్టె బాలకుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తాండ్ర నర్సింగరావు, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా సయ్యద్ యాకుబ్ పాషా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కడకంచి లక్ష్మి, సేవాదళ్ అధ్యక్షుడిగా తాండ్ర కమలాకర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనగామ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మండల అధ్యక్షులు గుండ శ్రీధర్ రెడ్డి, నాయకులు సర్వల నర్సింగ రావు, గానిపాక మహేందర్, మెరుగు బాలరాజు పాల్గొని నూతన కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు.