22 August, 2026 | 5:01 PM

హెజెలో ఫార్మా బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం

22-08-2026 04:03 PM

ఆలేరు,ఆగస్ట్ 22(విజయక్రాంతి): పోచంపల్లి మండలం దొతిగూడెంలోని హెజెలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు( Hezelo Pharma accident) ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గాంధీ ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. యశోద, సన్‌రైజ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఎమ్మెల్యే వెంట పోచంపల్లి నాయకులు పాక మల్లేష్ యాదవ్, కళ్లెం రాఘవ రెడ్డి, సామా మోహన్ రెడ్డి, అంబరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.