22 August, 2026 | 5:18 PM

కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి

22-08-2026 04:34 PM

భైంసా ( విజయక్రాంతి): బాసర మండల కేంద్రంలో శనివారం పిచ్చి కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో ఆరు గొర్రె పిల్లలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాసర గ్రామానికి చెందిన ఉంగేరి అశోక్‌కు చెందిన ఆరు గొర్రె పిల్లలపై శుక్రవారం అర్ధరాత్రి పిచ్చికుక్కలు దాడి చేసి చంపినట్లు బాధితుడు వాపోయాడు. కుక్కల దాడితో గొర్రె పిల్లలను కోల్పోయి తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో చిన్నారులపై  కూడా దాడులు జరిగాయి. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి పిచ్చికుక్కల బెడదను అరికట్టాలని కోరాడు.