23 August, 2026 | 2:30 AM

22ఏ భూముల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

23-08-2026 12:51 AM

గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో జరిగిన తప్పిదాలు, అక్రమ చేర్పులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ రెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ.. 22ఏ జాబితాలో జరిగిన అవకతవకలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంగీకరించిన నేపథ్యంలో జిల్లాలోనూ సమగ్ర విచారణ అవసరమన్నారు.

గ్రామం, మండలం, సర్వే నంబర్ వారీగా 22ఏ భూముల పూర్తి జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, గతంలో జరిగిన చేర్పులు, తొలగింపులపై ఆడిట్ నిర్వహించాలని కోరారు. తప్పుగా 22ఏలో చేర్చిన భూములను గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బంది, మధ్యవర్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 22ఏ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ లేదా సీబీఐ విచారణ జరిపించాలని,

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కొందడం శ్రీనివాస్ రెడ్డి, మర్కంటి ఏగండ, యేల్లు రాంరెడ్డి, ఉప్పల మధుసూదన్, చిలువేరి జనార్ధన్, రోట్టేల శ్రీనివాస్, చేప్యాల వెంకట్ రెడ్డి, నాయిని సందీప్ కుమార్, మాడుగురి నరసింహ ముదిరాజ్, వడ్డేపల్లి ప్రసాద్, పేడ్యాల శ్రీనివాస్, సల్ల శ్రీనివాస్, మంద వెంకట్, గడియారం రాజేశ్వర్ చారి, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.