ఉత్తమ దర్యాప్తు అధికారిగా కుషాయిగూడ ఎస్‌ఐ ఎన్. వెంకన్నకు పురస్కారం
ఉప్పల్ , ఆగస్టు 22విజయక్రాంతి : మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ దర్యాప్తు సేవలు అందించినందుకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకన్నకు ఉత్తమ దర్యాప్తు అధికారి పురస్కారం లభించింది. నేరేడుమెట్లోని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్, ఎస్‌ఐ ఎన్. వెంకన్నకు పురస్కారాన్ని అందజేసి అభినందించారు.
వివిధ కేసుల దర్యాప్తులో చూపిన ప్రతిభ, నిబద్ధత, వృత్తి నైపుణ్యాన్ని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ సుమతి మాట్లాడుతూ, ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతి కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడం పోలీసు అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.పురస్కారం అందుకున్న ఎస్‌ఐ ఎన్. వెంకన్నను సహచర పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.






