విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్లు
- నిందితుల అరెస్ట్, 23 కిలోల చాక్లెట్లు స్వాధీనం
- దర్యాప్తు ముమ్మరం చేసిన జగద్గిరి గుట్ట పోలీసులు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 22 (విజయక్రాంతి): విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లె ట్లు విక్రయిస్తున్న ముఠాను కుత్బుల్లాపూర్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు గంజాయి చాక్లెట్లను రవాణా చేస్తున్న ట్లు పోలీసులు గుర్తించారు. 23కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు.
నిందితులు గాజులరామారం, మహాదేవపురం ప్రాంతాలకు చెంది న జ్యోతి, కమల్ సింగ్, నేపాల్ సింగ్, దీపక్ సింగ్‌లుగా గుర్తించారు. విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిం దితులను జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. గంజాయి చాక్లె ట్ల సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు, వీటి విక్రయానికి సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






