వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితుల అరెస్ట్
- రిమాండ్ కు తరలింపు
కోహెడ,(విజయక్రాంతి): వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కోహెడ మండల కేంద్రానికి చెందిన పెసరు పర్షరాములు, వెంకటేశ్వరపల్లికి చెందిన రేగుల శ్రీనివాస్ లను శనివారం పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ సీఐ శ్రీధర్ మాట్లాడుడుతూ.. కోహెడ మండలం లోని గుండా రెడ్డి పల్లి, బస్వాపూర్, కోహెడ గ్రామాలలోని పలువురి ఇంట్లో రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగుల గొట్టి బంగారం వెండి వస్తువులు, నగదు దొంగిలించరన్నారు.
ఇరువురి నిందితులను మధ్యాహ్నం ధర్మసాగర్ పల్లి రోడ్డు.. కోహెడ చెరువు కట్ట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. స్టేషన్ కు తీసుకువచ్చి విచారించి వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కేసు చేదనలో ప్రతిభ కనబర్చిన కోహెడ ఎస్ఐ అభిలాష్, హెడ్ కానిస్టేబుల్ సంపత్, కానిస్టేబుల్లు రవి నాయక్, జీవన్ లను సీఐ అభినందించారు.






