23 August, 2026 | 2:32 AM

నాచారం గుట్టలో పవిత్రోత్సవాల అంకురార్పణ

23-08-2026 12:50 AM

గజ్వేల్: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నాచారం గుట్టలో పవిత్రోత్సవాల అంకురార్పణ కార్యక్రమాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. కార్యనిర్వాహణాధికారి శ్రీ బి. రంగాచారి ఆధ్వర్యంలో యజ్ఞాచార్యులు, రుత్వికులు, ప్రధాన అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పవిత్రత, భక్తుల క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.