23 August, 2026 | 3:36 AM

‘మామూళ్ల’ అంతస్థులు?

23-08-2026 01:09 AM
  1. అడిగినంత ఇస్తే..అంతా రైట్ రైట్!
  2. అవినీతికి నిలయంగా శేరిలింగంపల్లి 48, 49 సర్కిళ్లు
  3. అక్రమ కట్టడాలకు ‘కాసుల’ వర్షం
  4. బుట్టదాఖలవుతున్న ఫిర్యాదులు
  5. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వైఖరిపై ప్రతిపక్షాల ధ్వజం
  6. ముందే హెచ్చరించిన ‘విజయక్రాంతి’ కథనాలు

రంగారెడ్డి/ శేరిలింగంపల్లి, అగస్టు 22(విజయక్రాంతి) : శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ని 48, 49 సర్కిళ్ల టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై, అవినీతిపై, అక్రమకట్టడాలపై చా న్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ‘మామూళ్ల’ రాజ్యం.. ‘అడిగినంత ఇస్తే చా లు.. ఎన్ని అంతస్థులై నా లేపుకోండి, విచారణ వస్తే కొద్ది రోజులు పనులు నిలిపివే యండి’ అనే చందంగా క్షేత్రస్థాయి అధికారుల తీరు మారిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో మామూళ్ల అంతస్థులు పేకమేడలా కుప్పకూలుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరోపక్క ఆక్రమణలు, నిబంధ నల ఉల్లంఘనలపై వస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయి. ఇందుకు మాదాపూర్‌లోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్ప కూలడం నిదర్శనం అనే చె ప్పాలి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు బలికావడం కేవలం ఒక ప్రమాదం కాదు.. అధి కారుల అవినీతి, రాజకీ య అండదండలతో జరుగుతున్న పక్కా ‘హత్య’ అని బాధితులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. 30 నుంచి 50 గజాల చిన్న స్థలం లో, నాలాను కబ్జా చేసి ఏడంతస్థులు లేపుతుంటే కనీసం కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ విభాగం తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వైఖరిపై ప్రతిపక్షాలు ధ్వజం ఎత్తుతున్నాయి.

ప్రాణాలు పో యాకే నిబంధనలు గుర్తుకొస్తాయా? 50 గజాల లోపు స్థలాల్లో బహుళ అంతస్థులు ఎలా నిర్మిస్తున్నారు? అని ప్రశ్నల వర్షం కురిస్తున్నాయి. ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలపై స్థానికులు ప్రజావాణిలో, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.

తనిఖీల పేరిట హ డావిడి చేయడం, ఆపై మౌనం వహించడం పరిపాటిగా మారింది. గతంలో దాసరి హరిచందన, రోనాల్ రాస్ వంటి ఐఏఎస్ అధికా రులు, ప్రస్తుతం సీఎంసీ కమిషనర్ శ్రీజన, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ బాధ్యతల్లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు.

ఎమ్మెల్యే అరికెపూడిపై విపక్షాల ధ్వజం

అంజయ్యనగర్ ఘటనపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతు న్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన భవన యజమానులు, పర్యవేక్షణలో విఫలమైన అధికారుల పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకుండా మీ నమేషాలు లెక్కిస్తు న్నారని విమర్శిస్తున్నా యి. అక్రమ నిర్మాణాల వెనుక అధికార యంత్రాం గంపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా యా? లేదా ప్రజాప్రతినిధులకు కూడా ఇం దులో వాటాలు అందుతున్నాయా? అని ప్ర తిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పష్ట మైన వివరణ ఇవ్వాలని రాజకీయవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అంజయ్యనగర్ ఘ టనపై బాధితులు, స్థానికులు తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగాక హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసు లు రావడం, ప్రకటనలు గుప్పించడం రొటీన్‌గా మారిందని విమర్శిస్తున్నారు.

50 గజాల లోపు స్థలాల్లో ఇన్ని అంతస్థులా?

నాలాల పక్కన నిబంధనలకు విరుద్ధంగా భవనాలు వెలుస్తుంటే అనుమతులు ఎలా ఇస్తున్నారు? ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి శేరిలింగంపల్లి జోన్‌లో నిర్మిస్తున్న భవనాల అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడిన టౌన్ ప్లానింగ్ అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలపైన ‘విజయక్రాంతి’లో వరుస కథనాలు

అక్రమ నిర్మాణాలపైన ఇటీవల ‘విజయక్రాంతి’ దినపత్రికలో వరుసగా ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. నిబంధనలో ఉల్లంఘనలు, అధికారుల చేతివాటాలు.. చైన్‌మెన్ నుంచి అధికారుల వరకు.. ముడుపులు ముట్టజెప్ప డం.. ఇలా ప్రతి అంశంపైనా ఇటీవల కథనాలు వెలువడ్డాయి. అక్రమ కట్టడాల వల్ల.. భవిష్యత్‌లో జరిగే ప్రమాదా లు.. ఇబ్బందులను.. ముందే హెచ్చరించినా.. అధికారుల్లో అలసత్వం వీడ లేదు.. ఇప్పుడు జరిగిన అంజయ్య నగ ర్ ఘటనలతోనైనా అధికారుల్లో చల నం వచ్చి, కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి.