15 July, 2026 | 12:05 AM

విద్యార్థి కౌన్సిల్ ఎన్నికలు

15-07-2026 12:05 AM

ఉట్నూర్, జూలై 14 : ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో మంగళ వారం విద్యార్థి కౌన్సిల్ ఎన్నికలను ప్రజాస్వా మ్య స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా అలంకరించగా, విద్యార్థులు వరుసలో నిలబడి తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఇంకు గుర్తు ను చూ పిస్తూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నిర్ణయాత్మక సా మర్థ్యం, ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించే లక్ష్యం తో ఎన్నికలను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రి న్సిపాళ్లు సంగీత, భార్గవి, ఉపాధ్యాయులు మాధవి, అరుణ, కృష్ణవేణి, ఛాయా, సంధ్యారాణి, సౌమ్య, లక్ష్మీ, సమత, రజిత, నాగమ్మ, గౌతమీ, సతీష్, ప్రతిభశీల, రత్నమాల, ఆరాధన, రాధా, నిరోజా, పూజ, బస్సీ లలితా, సంజీత, కాత్లే లలితా, విద్యార్థులు పాల్గొన్నారు.