15 July, 2026 | 12:05 AM

2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలి

15-07-2026 12:00 AM

సీఎస్‌కు టీపీటీఎఫ్ వినతి

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, నూతన ఆరోగ్య పథ కం మార్గదర్శకాలను రూపొందించి ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డులను విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి విజ్ఞప్తి చేశారు.

ఈమేరకు సీఎస్ సంజయ్ జాజును మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూపొందిం చాలని, మోడల్ స్కూల్, గురుకుల, కేజీబీవీ టీచర్లకు నూతన ఆరోగ్య పథకం వర్తింపజేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పండిట్ పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్లు కల్పించాలని తెలిపారు.