15 July, 2026 | 12:03 AM

అల్ఫోర్స్ విద్యార్థినికి అబాకస్ పోటీలలో బంగారు పతకం

15-07-2026 12:03 AM

కొత్తపల్లి, జూలై 14 (విజయక్రాంతి): ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని అన్విత రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలలో బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి విద్యార్థినికి పతకం, ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.