14 July, 2026 | 8:54 PM

హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

14-07-2026 08:42 PM

ఉప్పల్ వాయి లో మొక్కలు నాటిన కలెక్టర్

రామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  అన్నారు. మంగళవారం రామారెడ్డి మండలంలోని ఉప్పల్ వాయి గ్రామంలో పాఠశాలలో విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి పెంచాలన్నారు. నేటి మొక్కలే రేపటి వృక్షాలు అవుతాయన్నారు.

ప్రతి గ్రామంలో విలేజ్ నర్సరీ ద్వారా ప్రజలకు అవసరం ఉన్న మొక్కలను పెంచామన్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. ప్రజలకు అవసరమైన మొక్కలను అందిస్తామన్నారు. అవసరమైన మొక్కలను తీసుకొని నాటి పెంచాలన్నారు. మొక్కలను పెంచిన వారిని గుర్తించి వారిని అభినందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ధర్మారెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.