15 July, 2026 | 12:04 AM

కచ్చా ఇండ్ల పరిశీలన వేగవంతం చేయాలి

15-07-2026 12:04 AM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 14 (విజయక్రాంతి):ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత కోసం ఎల్-1 జాబితాలో నమోదైన కచ్చా ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2,300 కచ్చా ఇండ్లలో ఇప్పటికే 1,800 ఇళ్ల పరిశీలన పూర్తుందని, మిగిలిన 500 ఇళ్లను వెంటనే పరిశీలించాలని సూచించారు.

తొలి విడతలో మంజూరైన 9,306 ఇందిరమ్మ ఇండ్లలో 683 పూర్తయ్యాయని, మిగిలిన వాటి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని సూచించారు.వర్షాభావంతో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి.- ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరి సాగుపై ఆధారపడకుండా తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు.

మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, కంది వంటి పంటలను సాగు చేస్తే నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. జూలై 31 వరకు వర్షాభావం కొనసాగితే ఆగస్టు తొలి వారంలో కందులు, ఉలవలు, అలసందలు, ఆముదం, నువ్వులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి పంటలను సాగు చేయడం రైతులకు లాభదాయకమని తెలిపారు. పంటల ఎంపిక, విత్తనాల లభ్యత, సాగు విధానాలపై మండల వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని రైతులకు సూచించారు.