30 July, 2026 | 2:22 AM

గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి

30-07-2026 01:32 AM

ప్రొద్దుటూరు సర్పంచ్ బండ లక్ష్మీ నరసింహ  

శంకర్‌పల్లి: జూలై 29( విజయ క్రాంతి ): గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని ప్రొద్దుటూరు గ్రామ సర్పంచ్ బండ లక్ష్మీ నరసింహ పేర్కొన్నారు. గ్రామ పం చాయతీకి నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు, చెత్తను సేకరించి ఎందుకు డాక్టర్ను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి వనరు ప్రజల సంక్షేమానికి వినియోగించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తప్పనిసరిగా చెత్త ట్రాక్టర్ లోనే వేయాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి, ఉప స ర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్లు శ్రీనివాస్, నరసింహారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.