22 May, 2026 | 12:58 AM

మట్టి అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు

22-05-2026 12:19 AM

ఎస్‌ఐ కృష్ణ సాగర్ రెడ్డి హెచ్చరిక 

ధర్మపురి,మే21(విజయక్రాంతి): గొల్లపల్లి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవంటూ ఎస్త్స్ర కృష్ణ సాగర్ రెడ్డి హెచ్చరించారు. మండలంలోని చిల్వాకోడూరు గ్రామంలో పెద్ద చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారనీ జీపీఓ ఎన్. జగపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఒక జెసిబీ 10 ట్రాక్టర్ల ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర తెలిపారు. మండలంలో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపితే శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామనీ ఈ సందర్భంగా ఎస్త్స్ర తెలిపారు.