ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
17-06-2026 01:31 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్ 16: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్,ఎన్ఫోర్మెంట్స్ ఏజీ రాంబాబు,ఎస్త్స్ర మహ్మద్ అన్నారు.మంగళవారం జాజిరెడ్డి గూడెంలో మన ఇసుక మన వాహనంలో నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాజెక్టులకు వెళ్తున్న ఇసుక లారీలను పరిశీలించారు. తదనంతరం కాంటాలను తనిఖీ చేసి ఎవరైనా అధిక లోడ్లతో వెళితే కఠిన చర్యలు తీసుకుం టామన్నారు.ప్రభుత్వ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ పాషా,సిబ్బంది తదితరులు ఉన్నారు.






