15 March, 2026 | 4:09 AM

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ గా విక్రయిస్తే కఠిన చర్యలు

14-03-2026 09:57 PM

ఎస్ఐ చలికంటి నరేష్

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలలో ప్రభుత్వ నిర్ణయించిన ధరల కంటే అధికంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గరిడేపల్లి ఎస్సై చలికంటి నరేష్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ గోడౌమ్ ను ఆయన సందర్శించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడిన ఎస్సై, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు విక్రయించరాదని స్పష్టం చేశారు.

నిబంధనలు ఉల్లంఘించి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో “గ్యాస్ కొరత”అంటూ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై చలికంటి నరేష్ హెచ్చరించారు.