నక్సలిజం రహిత సమాజమే లక్ష్యం
- కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
- మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీస్ అధికారులకు సన్మానం
- డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్‌కుమార్, మల్కాజ్‌గిరి సీపీ, మాజీ ఎస్‌ఐబీ ఐజీపీకి సన్మానం
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): దేశాన్ని పట్టి పీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే మోదీ ప్రభుత్వ సంకల్పమని కేం ద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో తీవ్రవాద ప్రభావిత ప్రాం తాల్లో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీస్ అధికారులను సోమవారం సన్మానించా రు.
తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని సమూలంగా అణచివేసి, రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులను అమిత్‌షా సన్మానించారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రాన్ని అమిత్‌షా ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్, రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ బీ శివధర్‌రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్ గ్రేహౌండ్స్) అనిల్‌కుమార్, మల్కాజ్‌గిరి కమిషనర్, మాజీ ఎస్‌ఐబీ ఐజీపీ సుమతితోపాటు ఆమె నేతృత్వంలోని ఎస్‌ఐబీ బృందాన్ని అమిత్‌షా సన్మానించి, వారి విశేష సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ.. జనవరి 2024లో ఒక అంతర్గత సమా వేశంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని తాము కాలపరిమితిని నిర్దేశించుకున్నట్లువెల్లడించారు. తాము ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది ప్రైవే ట్ చర్చల్లో ఇది సాధ్యం కాదంటూ సందేహాలు వ్యక్తం చేశారని, కానీ తాము స్పష్టమైన ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ముందుకు సాగామ న్నారు.
ఈ రోజు బస్తర్ ప్రాంతాన్ని నక్సల్స్ రహితంగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంద ని అమిత్‌షా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సలిజం మహమ్మారి నుంచి విముక్తి పొందిందని, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ పోరాటంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన కొనియాడారు.
1970వ దశకం నుంచి 31 మార్చి 2026 వరకు దాదాపు మూడు తరాల పాటు దేశ ప్రజ లు నక్సలిజం అనే ఒక పీడకలను చవిచూశారని అమిత్‌షా ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర రక్తపాతం, అభివృద్ధి నిలిచిపోవడం, యువత భవిష్యత్తు అంధకార మవ్వడం వంటి పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. నక్సలిజం నిర్మూలన పోరాటంలో దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన జవాన్లు ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాల వల్లే నేడు ఈ విజయం సాధ్యమైందని హోంమంత్రి అన్నారు.
నక్సలిజం కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదని, తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా దీనిపై ఆందోళన ఉండేదన్నారు. ఒక జీవిత కాలంలో సాధిం చలేమనుకున్న అసాధ్యమైన లక్ష్యాన్ని, భద్రతాదళాల సమన్వయం, పట్టుదలతో సాకారం చేశామని అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, భద్రతా దళాల ప్రతినిధులు పాల్గొన్నారు.






