19 May, 2026 | 2:35 AM

అప్పిచ్చినవారి హత్య!

19-05-2026 01:12 AM
  1. మొయినాబాద్ జంట హత్యల కేసులో ఘోరాలు 
  2. మొత్తం 8 మందిని చంపేందుకు నిందితుల ప్లాన్! 
  3. పిలిచిన చోటికి వెళ్లక ప్రాణాలు దక్కించుకున్న ఆరుగురు 
  4. తాండూరు పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టిన బాధితులు

తాండూరు/మొయినాబాద్, మే 18 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాం హౌస్‌లో జరిగిన జంట హత్యల ఉదంతం పెనుసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో విస్తుపోయే నిజం వెలుగులోకి వస్తోంది. కేవలం అప్పులు ఎగ్గొట్టడమే కాకుండా, అప్పు ఇచ్చి న వారిని శాశ్వతంగా మట్టుబెట్టడమే లక్ష్యంగా కరీ మా బేగం దంపతులు ఈ దారుణాలకు పాల్పడిన ట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇప్పటికే ఇద్దరు మహిళలను అంతమొందించిన ఈ ముఠా.. మరో ఆరుగురు మహిళల హత్యకు కూడా స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ ఆయా ఆబేదా బేగం, యాలాల మండలం ఇందిరమ్మ కాలనీకి చెం దిన మెహబూబ్బీలు నిందితులకు పెద్దమొత్తంలో అప్పు ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో కరీమా బేగం, రెహమాన్, నయీం పథ కం ప్రకారం వారిని మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌కు పిలిపించారు.

అక్కడ వారిద్దరిని గొంతు నులిమి అత్యంత కిరాతకంగా హత్యచేసి, ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే పూడ్చిపెట్టారు. ఈ జంట హత్యల ఉదంతం బయట కు రావడంతో తాండూరు ప్రాంతంలోని ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలకు చెంది న బాధితుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం స్థానిక మున్సి పల్ కౌన్సిలర్ జావిద్‌తో కలిసి పెద్ద సం ఖ్యలో మహిళలు తాండూరు పోలీస్ స్టేషన్‌కు క్యూకట్టారు.

తాము కూడా కరీమా బేగం దంపతులకు లక్షలాది రూపాయలు అప్పు ఇచ్చామని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అప్పులు తిరిగి డబ్బులు ఇస్తాం, ఫామ్‌హౌస్‌కు రండి అంటూ నిందితులు తమను కూ డా పిలిచారని బాధితులు పోలీసుల ముం దు వాపోయారు.

అప్పట్లో ఇళ్లల్లో ఉన్న పని ఒత్తిడి కారణంగా తాము వెళ్లలేదని, వెళ్లుంటే తమను కూడా చంపేసి పూడ్చిపెట్టేవారని చెప్తూ మహిళలు భయంతో వణికిపోయా రు. ఇలావుండగా, పోలీసులు విచారిస్తుండగా, కరీమా బేగం ఫినాయిల్ తాగి ఆత్మహ త్యాయత్నానికి ప్రయత్నించగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

నిందితుల బ్లాక్‌మెయిల్..

ఇళ్లల్లో గొడవలు కాకూడదని, భర్తలకు తెలియకుండా పొదుపు చేసుకున్న డబ్బును కరీమా బేగం నమ్మిస్తే అప్పుగా ఇచ్చామని బాధితులు తెలిపారు. తీరా డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా నిలదీస్తే.. ‘మీ భర్తలకు చెప్తాం.. ఏం చేసుకుంటారో చేసుకోండి‘ అంటూ నిందితులు ఎదురుతిరిగే వారని, మానసికంగా వేధించేవారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిందితుల బ్యాంక్ ఖాతాలను, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. బాధితులకు న్యా యం జరిగేలా చూస్తామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.